మాట్లాడు నా ప్రభువా నాతో మాటాడు నా ప్రభువా

 

మాట్లాడు నా ప్రభువా నాతో మాటాడు నా ప్రభువా 

నీ మాటలే జీవపు ఊటలు నీ పలుకులే ప్రాణదారాలు(2) 

1.సమరయ స్త్రీ తో మాటాడావు  

సకల పాపములు హరియించావు(2) 

జీవ జలములు త్రావనిచ్చావు (2) 

జీవితమునే మార్చి వేసావు(2) 

 

2.చచ్చిన లాజరును చక్కగా పిలిచావు  

బయటకు రమ్మని ఆదేశించావు(2) 

కుళ్ళిన శవముకు జీవము నిచ్చావు (2) 

మళ్ళీ బ్రతుకును దయచేసావు(2)