మహోన్నతుడైన దేవుడు – మహిమరూపుడు

 

మహోన్నతుడైన దేవుడు – మహిమరూపుడు 

మహిలోని జనులపై తన ప్రేమచూపెను 

ప్రియకుమారుడు యేసయ్యను ఈలోకమునకు పంపెను 

మానవాళి జీవితాలలో వెలుగు నింపెను 

1. ఆదియందే ఉన్న వాక్యం – దేవునియొద్ద ఉన్నవాక్యం 

దేవుడై యున్నట్టి వాక్యం – ప్రేమయై యున్నట్టి వాక్యం 

మనుష్య రూపమును కృపా సత్యమును 

ధరించుకొని నరుల మధ్యను నివసించను జనియించెను 

2. బంధకములలో ఉన్నవారికి విడుదలను ప్రకటించుటకును 

భారభరిత ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ధరింపజేయను 

సువర్తమానమును దీనులకందించను 

దేవుని అభిషేకమును పొందెను – దైవాత్మతో ఉదాయించెను