మహిమ గల రాజా నిన్నే స్తుతియింతుము

 

మహిమ గల రాజా నిన్నే స్తుతియింతుము  

మహోన్నత దేవా నిన్నే కీర్తింతిము 

యేసు రాజా రాజుల రాజా నిన్నే కీర్తింతును 

యేసు రాజా రాజుల రాజా  మా సర్వం నీకిత్తును 

కష్టమైన నష్టమైన నిన్నే కొనియాడేదం శోధన లైన వేదనలైన నీకై జీవింతును 

ఎన్ని నిందలొచ్చినా ఎన్ని బాధలొచ్చినా నీ కొరకే మేం నిలుతుము       “యేసు 

 

నత్తి వాడైన మోషేను నాయకుడిగా చేసెను 

గొల్ల వాడైన దావీదును  గొప్ప రాజుగా మార్చెను 

బానిసనైన యోసేపును బహు బహుగా దీవించెను                  “యేసు 

 

పిరికి వాడైన పేతురును పౌరుషముతో నింపెను  

పొట్టి వాడైన పౌలును గట్టి వాడిగా చేసెను 

అనుమానించే తోమాను సిలువ సాక్షిగా మార్చెను                    “యేసు 

 

దుక్కి దున్నే ఎలీషాను దీర్గదర్శి గా మార్చెను 

బాలుడైన సమూయేలును యజకునిగా మార్చెను 

బలహీనుడైన గిద్యోనును బలాఢ్యునిగా మార్చెను.                   “యేసు