మహిమగల వాక్యము మాజిహ్వకు మధురము – యేసయ్యా

 

మహిమగల వాక్యము మాజిహ్వకు మధురము – యేసయ్యా 

నీ మాటలు బంగారపు మూటలు – నీ వాక్యము చేతనే 

మమ్ము బ్రతికించితివి స్తోత్రముల్ 

1. వాక్యంబనెడు నామము గలిగి – వాక్యము చేతనే సృష్టినిజేసి 

వాక్యముతోనే జీవము నిచ్చి – మృతులబ్రతికించితివి నీ 

జీవము మాకిచ్చితివి 

2. తేనెకంటె తియ్యని వాక్యం – పాలకంటే పావన వాక్యం 

నీటి కంటే నిర్మలవాక్యం – హెచ్చరికనిచ్చును 

లాభము కలిగించును 

3. దివారాత్రులు వాక్యధ్యానం – ధన్యతనిచ్చును దీవెననిచ్చును 

చేయునదంతా సఫలము చేయును – దృష్టిని కలిగించును 

దృఢపరచును ఆత్మను 

4. బలము కలది నీ వాక్యంబు – బలపరచును భక్తిపరులను 

బాధాలను తీయును బోధలు చేయును భయమును పొగొట్టును 

బహుక్షేమము నిచ్చును 

5. దుష్టుని అగ్ని బాణములను – ద్రుంచుటకొరకై దోష హరీ 

దేవా వాక్య ఖడ్గమునిచ్చితి – ధైర్యము చేకూర్చితివి 

దీనుల కండైతివి