మహాఘనుఁడవు, మహోన్నతుడవు

 

మహాఘనుఁడవుమహోన్నతుడవు 

పరిశుద్ధస్థలములోనే నివసించువాడవు 

కృపాసత్యసంపూర్ణమై 

మా మధ్యలో నివసించుట న్యాయమా! 

నను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా! 

1.వినయముగల వారిని 

తగిన సమయములో హెచ్చించువాడనని  

నీవు వాడుపాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో 

హల్లెలూయ యేసయ్యా నీకే స్తోత్రమయా”మహా 

2.దీనమనస్సు గలవారికే సమృద్ధిగా 

కృపను దయచేయువాడవని 

నీ సముఖములో సజీవసాక్షినై 

కాపాడుకొందును మెలకువతో 

హల్లెలూయ యేసయ్యా నీకే స్తోత్రమయా”మహా 

3.శోధింపబడువారికి మార్గము చూపించి తప్పించువాడవని 

నా సిలువ మోయుచు నీ సిలువనీడను 

విశ్రమింతును అంతమువరకు 

హల్లెలూయ యేసయ్యా నీకే స్తోత్రమయా”మహా