మహఘనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు

 

మహఘనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు 

1.యేసే నీకు ఆశ్రయము ఆయన నీకు కోటయగును 

దేవుడని నీవునమ్ముకొనుము ఆయన నీడలో విశ్రమించుము-మహ 

2.వేటకాని ఉరినుండి విడిపించును వినాశము రాకుండ నిన్ను కాచును 

తన రెక్కలతో నిన్ను కప్పును కేడెము మోయుచు నీచోనుండును (మహ) 

3.వేయిమంది నీ ప్రక్కను పడియుండగా పదివేలు కుడిప్రక్క కూలిపడాగ  

అపాయము నీకు సంభవింపదు ఆ ప్రభూవే నీ ప్రక్క నిలుచును.(మహ) 

4. నీదు పాదములకు రాయి తగులదు దూతలు చేతులతో ఎత్తుకుందురు 

యేసు నామమేరిగి నివు నిలువుము యేసే నీకు ఘనతనిచ్చును.(మహ)