మన మేసుని వారలము తన వారిగానే యుందము

 

మన మేసుని వారలము  తన వారిగానే యుందము 

మనలను రక్షించెను తనకే స్తుతి పాడేదము 

కృపా సత్య సంపూర్ణ వాక్యము నర రూపియాయెను 

కనుగొంటిమి తండ్రీ మహిమను జనతైక కుమారినిలో 

తన ప్రేమ అద్భుతమైనది-మనము కొనియాడేదము 

వారు అయన తట్టు చూడగా వెల్గు కల్గెను 

మనలను తానె వెలిగించెను తన వాక్యము ద్వారనే 

ప్రభు ఉత్తముడని యెరిగి -తనకే స్తుతి పాడేదము 

దైవ పుత్రుండు సజీవరాళ్ళతో ఇంటిని కట్టుచున్నాడు 

దేవుని తేజము రాగా మహిమతో నిండే గృహము 

ఆయన  మందిరములో-తన మహిమను పాడేదము 

ఎందరిని ప్రభు ముందు యెరిగెనో వారిని నిర్ణయించెను 

పిలిచి నీతిగా తీర్చి మహిమ పరచెను 

తన తనయుని రూపమిచ్చె– మనమానందమొందెదము 

పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చును 

కనిపెట్టు వారెత్తబడుదురు తన మహిమ పొందెదరు 

తన రాజ్యముగా జేసి –హల్లెలూయా పాడెదము 

6మహిమ నివసించు మహిమ రాజ్యంబు మహిమతో నిండి యుండును 

మన ప్రభువే దీపమై యుండును-తన వెలుగు ప్రచురమగున్ 

యుగయుగములు మనమంతా -ప్రభు యేసుతో నుండెదము