మన జీవితమంతయు-అనుక్షణము యుద్ధమే

 

మన జీవితమంతయు-అనుక్షణము యుద్ధమే 

ఇదియే సిలువమార్గము-మహిమ రాజ్యమెుందును 

1.ఈ యాత్రలో ముందుకు-సాగిన తోడ్పడి 

యేసుడే నడుపును మనలను-తన మార్గము నందున 

2.ఆ సిలువమార్గము-ఎంతో ఇరుకైనది 

క్రీస్తునే గురిగా నుంచిన-విజయము నిశ్చయము 

3.ఇహమందు శ్రమలు-రానున్న మహిమలో 

ఎన్నదగినవి కావుగా-క్రీస్తే దుఃఖము బాపును 

4.ఈ జగతిలో కష్టములు-బాధలు కలిగిన 

ధైర్యము విడువక యుందుము-జయించె ప్రభువు ఇహమును