మనిషి నీకు తెలుసా…శరీరం నీకు శతృవని.

 

మనిషి  నీకు తెలుసా…శరీరం నీకు శతృవని..(2) 

లోకాన్నే కోరి మరణానికి చేరి విడిచిపోతుందీ ఏదో క్షణం 

నరకయాతనే నీకు క్షణక్షణం ….(2) 

1.శరీరాన్ని నమ్ముకున్న ఎందరో.. 

మట్టిలో కలిసిపోయారని(2) 

వట్టి చేతులతోనే పోయారని(2) 

కలకాలం ఉండము మనమూ.. 

కనుమూస్తే అంతా వ్యర్థము…(2)(మనిషి) 

2. బైబిల్ చెబుతుందొక నీతీ… 

శరీరాన్ని నమ్ముకోవద్దనీ…(2) 

ఆత్మానుసారముగా జీవించుమని(2) 

శరీరం మన్నేనయ్యా నీ ఆత్మా దేవుని వరమయ్యా(2)(మనిషి) 

3. ఈ లోకం శాశ్వతమని నమ్మకూడదు…. 

నమ్మి ఆ నరకానికి వెళ్ళకు(2) 

యేసయ్యను దేవుడని నమ్మగలిగితే(2) 

పరలోకం నీదే కాదా….ప్రభు యేసే చెప్పిన దీ భోదా..(2)(మనిషి)