మధురం ఈ సమయము – హృదయం ఉప్పొంగెను

 

మధురం ఈ సమయము – హృదయం ఉప్పొంగెను 

మన బ్రతుకులో మరో ఏడు గడచిపోయెను 

తన రెక్కల నీడలో ప్రభు మనలగాచెను 

happy new year- (4) 

1. సిరిగలవారెందారో – బలమున్న మరెందరో 

మరి కానరాకుండ ధరను విడిచిపోయిరి 

కాదు కాదు మన ఘనత – కేవలమిది తనదు కృప 

మనలనింక ఊపిరితో మహిలొనుంచెను 

2. లెక్కలేమి ఆపదలు – చుట్టుకున్న వేళలలో 

చక్కనైన జ్ఞానమిచ్చి చిక్కులన్ని బాపెను 

విడువలేదు ఏ క్షణము – మరువలేదు ఏ దినము 

దీవెనలెన్నో కృపతో మనకు పంచెను