మత్తును వీడండి ప్రియులారా మద్యము మానండి

 

మత్తును వీడండి ప్రియులారా మద్యము మానండి 

చిత్తుగ తాగి సత్తువ కోల్పోయి 

నెత్తిన చిక్కులు తెచ్చుకొనకండి 

1. బుద్ధి మందగించునండి – శ్రద్ద తగ్గిపోవునండి 

పొద్దాు గుంకగానే చేరి కొద్ది అంటూ మొదాలుపెట్టి 

హద్దు మీరి తాగి ఆపై మొద్దులగుట ఏలనండి 

2. రక్తమంత చెడునండి – శక్తిహీనులగుదాురండి 

ముక్తిదాత యేసుస్వామి సూక్తులను చెవినబేట్టి 

భక్తితోడ వేడిన విముక్తినిచ్చు నిజమండి 

3. ధనము కరిగి పోవునండి – ఘనత చెరిగి పోవునండి 

జనకుడైన యేసు ప్రేమ కనక నీవు పాపముతో 

పనికిమాలి కడకు నరకమునకు చేరుటేలనండి.