మట్టివిరా వట్టివిరా మన్నువురా మన్నావురా

 

మట్టివిరా వట్టివిరా మన్నువురా మన్నావురా 

కాయము మాయమురా ఖాయమురా అయ్యయ్యో(2) 

 

1.అటుచేసి ఇటుచేసి అందరిని మోసం చేసి 

సంఘాన్ని రెండుగ చీల్చావే అయ్యయ్యో 

నీ గోతిలో నువ్వే పడ్డావే అయ్యయ్యో 

 

2.నువ్వేసిన వేషాలు నువు చేసిన మోసాలు 

నరకాగ్నికి నిను చేర్చునులే అయ్యయ్యో 

నరకాగ్నిలో కాలిపోదువులే అయ్యయ్యో 

 

3.నీ బ్రతుకు దెవురుకోసం బైబిల్ ను చేతబట్టి 

పరమార్ధం మర్చిపోయావే అయ్యయ్యో 

 

4.సువార్త సేవకోసం పంపిన సొమ్ములన్ని 

సొంతానికి ఖర్చు చేసావే అయ్యయ్యో 

శాపాన్ని తెచ్చుకున్నావే అయ్యయ్యో 

 

5.పాపాన్ని పాతిపెట్టి దోషాన్ని దాచిపెట్టి 

దొరలాగ తిరుగుచున్నావే అయ్యయ్యో 

తొందరలో దొరికిపోతావే అయ్యయ్యో 

 

6.నీ పాపం ఒప్పుకుంటే ఆ పాపం విడిచిపెడితే 

పరలోకం నిన్ను చేర్చునులే యేసయ్యా 

నీ పాపం కదిగివేయునులే మెస్సయ్యా