మందిరములోనికి రారండి వందనీయుడేసుని చేరండి

 

మందిరములోనికి రారండి వందనీయుడేసుని చేరండి 

కలవరమైనా కలతలు ఉన్నా – తొలగిపోవును ఆలయాన చేరను 

కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను 

1.దేవుని తేజస్సు నిలచే స్థలమిది- 

క్షేమము కలిగించు ఆశ్రయపురమిది 

వెంటాడే భయములైనా వీడని అపజయములైనా ||తొలగిపోవును|| 

2.సత్యము భోదించు దేవుని బడి ఇది 

ప్రేమను చాటించు మమతల గుడి ఇది 

శ్రమలవలన చింతలైనా శత్రువులతో చిక్కులైనా ||తొలగిపోవును|| 

3.శాంతి ప్రసాదించు దీవెన గృహమిది 

స్వస్థత కలిగించు అమృత జలనిధి 

కుదుటపడని రోగమైనా ఎదను తొలచు వేదనైనా ||తొలగిపోవును||