మందిరం ప్రభుని మందిరం సుందరమైనది చూడదగినది

 

మందిరం ప్రభుని మందిరం సుందరమైనది చూడదగినది 

మరపురానిది మరువజాలని పరిశుద్ధమైనది పావనమైనది 

1. మనుష్యుల చేత విసర్జింపబడి దేవుని చేత ఏర్పరచబడినది 

సజీవమైన రాళ్ళ చేత కట్టబడినది ఈ మందిరం ||మందిరం|| 

2. అన్యజనులలో కదలిక కలిగెను కదిలిరి వారు కానుకలతో 

అర్పించిరి తమ ఇష్ట వస్తువులు 

నింపిరి మహిమతో ఈ మందిరమును ||మందిరం|| 

3. కష్టపడిరి తన సేవకులంతా నష్టమనక మన దేవుని పనికై 

పస్తులుండిరి ఆత్మల కొరకై పాటుపడిరి ||మందిరం|| 

4.మునుపటి మందిరము కన్న మించినదై 

కడవరి మందిరము మహిమతో నింపబడె 

కనబడుచున్నది కాంతివంతముగా 

నిండియున్నది శాంతి సమాధానం ||మందిరం||