మంచి దేవుడు యేసు దేవుడు – నా ప్రాణ స్నేహితుడు…

 

మంచి దేవుడు యేసు దేవుడు – నా ప్రాణ స్నేహితుడు… 

ప్రేమించెను ప్రాణమిచ్చెను – ఈ స్థితికి నన్ను చేర్చెను…II2II 

నా పేద బ్రతుకును మార్చినాడు – నన్నెంతో దీవించెనుII2II 

లోకాన దొరకని తన శ్రేష్ట ప్రేమ – నా యెడల కనుపరచినాడుIIమంచిII 

1.నా బాధలన్ని తొలగించినాడు – నా భారమే మోసినాడు 

నా దుఃఖ దినములు సరిచేసినాడు – సంతోషమే ఇచ్చినాడు 

తన కౌగిట చేర్చుకొని నా కన్నీటినే తుడిచినాడు.. 

నీ తల్లి మరిచినా… నే నిన్ను మరువను అని ఆభయమే ఇచ్చినాడు IIమంచిII 

2.నా దీన స్థితిని గమనించినాడు – నా గాదనే మార్చినాడు 

నే పడిన స్థితిని గుర్తించినాడు – తన చేతితో లేపినాడు 

నా గాయములన్ని కడిగి-నన్నెంతో ప్రేమించినాడు 

తన ప్రేమ చాటే ఓ గాయకునిగా తన స్వరమునే ఇచ్చినాడుIIమంచిII 

3.నా పాప శిక్షను భరియించినాడు-నా పక్షమే నిలిచినాడు 

నా కొరతలన్ని తను తీర్చినాడు-నా నింద తొలగించినాడు 

నీ నడిగిన అన్నివేళలా – నా మనవి మన్నించినాడు 

నే వెళ్ళు దారిలో – నా తోడు నడిచి – నన్నెంతో బలపరిచినాడుIIమంచిII