భూమ్యాకాశములు-సృజించిన యేసయ్యా-నీకే స్తోత్రం

 

భూమ్యాకాశములు-సృజించిన యేసయ్యా-నీకే స్తోత్రం “2″  

నీ ఆశ్చర్యమైన క్రియలు-నేనెలా మరచిపోదును “2″  

హలెలూయ లూయ… లూయ… హలెలూయా “4″  

 

1. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి-విడిపించావు నన్ను  

 ధీనదశలో నేనుండగా-నను విడువనైతివి “2″  

 

2. జీవాహారమై నీదు వాక్యము-పోషించెను నన్ను  

ఆకలితో అల్లాడగా-నను తృప్తిపరచితివి “2″  

 

3. భుజంగములను అణచివేసి-కాచినావు నన్ను  

ఆపదలో చిక్కుకొనగా-నను లేవనెత్తితివి “2″  

 

4. నూతన యెరుషలేం నిత్యనివాసమని-తెలియజేసితివి  

– నిట్టూర్పులలో ఉండగా-నను ఉజ్జీవపరచితివి “2″