భూనివాసులకు – ఈ లోక నివాసులకు

 

భూనివాసులకు – ఈ లోక నివాసులకు 

    యేసే జీవం – యేసే సత్యం – యేసే మార్గమనీ సూటిగ ప్రకటించు 

1. పరిసరములలోని – పండిన పైరంతా 

    రాలిపోవు చుండ – సంతాపమే లేదా 

    కన్నెత్తిచూడు – కన్నీరు కార్చు 

    ఓ దైవ సేవకుడా – ఇకనైనా మేల్కొనవా   “భూనివా 

2. పరమాత్మ ఆజ్ఞగని – ఆ యాత్మ స్వరమువిని 

    పౌలువంటి భక్తులు – ప్రాణాలు తెగియించిరి 

    దేవుని వాక్యము – దేదీప్యమానము  

    దీనుడవై యెపుడు – దీక్షతో చాటించు     “భూనివా 

3. సువార్త భారమును – సంపూర్ణ భాద్యతతో 

    మోయాలి భోధకులు – చేరాలి గ మ్యాలు 

    దేవుని మార్గము – పూజనీయము 

    దివ్వెగ జీవించు – ధర్మము నెరవేర్చు     “భూనివా 

4. సంఘమ మేల్కొనుమా – సాతానునెదిరించుమా 

    సర్వాంగ కవచమును – ధరియించి పోరాడుము 

    చీకటి త్రోవలో – సువార్త జ్యోతివై 

    జ్వాలను రగిలించు – రక్షణ ప్రకటించు   “భూనివా