భీకరుండౌ మా యెహోవా – పీఠ మెదుటన్ గూడరేఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే

 

భీకరుండౌ మా యెహోవా – పీఠ మెదుటన్ గూడరే 

ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే            ||భీకరుండౌ|| 

 

మట్టితోనే మమ్ము నెల్ల – మానవులుగ సృజించెను 

ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము   || భీకరుండౌ || 

 

ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెను 

ధారుణిన్ దానొక్కడే మా – దైవమని పూజింతుము     || భీకరుండౌ || 

 

పుట్టగిట్టన్ జేయ దానై – నట్టి దేవుని శక్తిని 

బట్టుగా లోకస్తులారా – ప్రస్తుతింపరే భక్తిని                 || భీకరుండౌ || 

 

మేటి సంగీతంబులపై – మింట నారవ మొందను 

జాటరే వేవేల నోళ్ళన్ – సన్నుతుల్ ప్రభు వందను       || భీకరుండౌ || 

 

మిక్కిలి కష్టంబులతో – మిత్తికిని బాల్పొందను 

దిక్కు లేని గొర్రెలట్లు – దిరుగ జేర్పన్ మందను           || భీకరుండౌ ||