భజియింతుము నిను జగదీశా శ్రీ యేసా మా రక్షణకర్త

 

భజియింతుము నిను జగదీశా శ్రీ 

యేసా మా రక్షణ కర్తా (2) 

శరణు శరణు మా దేవా యెహోవా 

మహిమాన్విత చిర జీవనిధి (2)          ||భజియింతుము|| 

 

విమల సెరాపులు దూత గణంబులు 

చూడగ లేని తేజోనిధివే (2) 

మా యధములకై సిలువ మ్రానుపై 

దీనుడవై మరణించితివే (2)           ||శరణు|| 

 

ప్రప్రధముడ మరి కడపటి వాడా 

మృతుడై బ్రతికిన నిరత నివాసి (2) 

నీ భజనలు మా జీవనాధారం 

చేకొనవే మా స్తుతి గీతం (2)         ||శరణు||