బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా

బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా
నిలవాలని ఉన్నా నిలవలేకున్నా ||2||
చూడాలని ఉన్నా చూడలేకున్నా
చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా
బ్రతికించుమో యేసయ్యా
దరి చేర్చుమో నన్నయ్యా ||2||            ||బ్రతకాలని||

కాపరి లేని గొర్రెనైతి
కాటికి నే చేరువైతి
కావలి లేని తోటనైతి
కారడవిగా నే మారితి
గూడు చెదరిన గువ్వనైతి
గుండె పగిలిన ఎకాకినైతి
గుండె దిగులుగా ఉందయ్యా
గూడు చేర్చుమో యేసయ్యా ||2||         ||బ్రతకాలని||

 

నా ఆశలే అడియాశలై
అడుగంటెనే నా జీవితం
శోధనల సుడివడిలో
తొట్రిల్లెనే నా పయనం
చుక్కాని లేని నావనైతి
గమ్యం తెలియక అల్లాడుచుంటి
గురి చేర్చుమో యేసయ్యా
గుండె గుడిలో నీవుండయ్యా ||2||         ||బ్రతకాలని||

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *