బైబిల్ చెబుతుందీ ప్రపంచ భవిష్యత్తూ…

 

బైబిల్ చెబుతుందీ ప్రపంచ భవిష్యత్తూ… 

లోకానికి వస్తుందీ విపత్తు .మీద విపత్తు (2) 

తెలుసుకోండి ప్రజలారా ఇది దేవుని ఉగ్రతా(2) 

క్రీస్తు కొరకు బ్రతకండి దేవుడున్నాడు జాగ్రత్త(బైబిల్ ) 

1.అల్లాడుతుంది ప్రపంచం ఆకలి చావులతో 

తల్లడిల్లిపోతుంది కుదరని రోగాలతో (2) 

వణికిపోతుంది ప్రపంచం శ్రమలకు గడగడా ..(2) 

కష్టమై పోతుంది భువిపై మానవ మనుగడ (2)(బైబిల్) 

2.అందమైన ఈ లోకం అడవైపోతుంది 

ప్రజల మద్యన ప్రేమ చల్లారి పోతుంది(2) 

దేవుని మాటలు లేక పాడయిపోతుంది 

వినాశనం వైపుకు పరుగులు తీస్తుంది (2)(బైబిల్) 

3.పంచభూతములు వేండ్రములో లయమైపోవునూ.. 

భూమియు దానికృత్యములు కాలిపోవునూ(2) 

ఎదురు చూడాలి క్రీస్తు కొరకు భక్తి శ్రధ్దలతో 

పరమ చేరాలి క్రీస్తుతో నిత్య సుఖాలకు(2)(బైబిల్)