బేత్లేహేం పురమున చిత్రంబు కలిగె కర్తాది

 

బేత్లేహేం పురమున చిత్రంబు కలిగె 

కర్తాది యేసు జన్మించినపుడు 

అంధకారంపు పృథివి వీధులలో 

మోదంపు మహిమ చోద్యంబుగానరే 

 

ఉదయంపు తారల్ ముదమున బాడే 

ఉదయించ యేసు ఈ పృథివిలోన 

ముదమును గలిగె మరి సమాధానం 

పదిలంబుతోడ పూజించ రండి            ||బేత్లేహేం|| 

 

పరమును విడచి నరరూపమెత్తి 

అరుదెంచి యేసు పరమ వైద్యుండై 

నరుల దుఃఖములన్ తొలగించివేసి 

పరలోక శాంతి స్థిరపరచె ప్రభువు         ||బేత్లేహేం|| 

 

నీదు చిత్తమును నాదు హృదయమున 

ముదమున జేయ మదినెంతో యాశ 

నీదు పాలనము పరమందు వలెనె 

ఈ ధరణియందు జరుగంగ జూడ       ||బేత్లేహేం|| 

 

దేవుని సన్నిధి దీనత నుండ 

పావనయాత్మ పవిత్ర పరచున్ 

పావనుడేసు ప్రకాశమిచ్చి 

జీవంబు నొసగి జీవించు నెదలో       ||బేత్లేహేం|| 

 

గతించె రాత్రి ప్రకాశించె కాంతి 

వితానముగ వికసించె నెల్ల 

దూతల ధ్వనితో పతి యేసు క్రీస్తు 

అతి ప్రేమతోడ అరుదెంచె నోహో     ||బేత్లేహేం||