బెత్లెహేము పురమునందు చిత్రమాయెనంట

 

బెత్లెహేము పురమునందు చిత్రమాయెనంట 

కర్తయేసు బాలుడుగా జననమాయెనంట 

అంధాకారమైన – ఆకస వీధులలో 

ఆనందపు మహిమ చోద్యామేమిటోనంట 

 

1. పరమ పురమే వదలి పావనుండు యేసు 

నరజాతిని ప్రేమించి ఇలకు దిగెనంట 

ఇమ్మానుయేలుగా – నెమ్మది నీయగా 

కన్నె మరియ గర్బాన పుట్టెనంట చూడరండి 

 

2. గొల్లలేమో వార్త విని గొర్రెలనే వదలి 

మెల్లగా అందారికి చాటి చెప్పిరంట 

దావీదాు పురములో – లోకరక్షకుడుగా 

యేసయ్య జనియించిన సంబరమే కనరండి 

 

3. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ 

ఇష్టులైన మనుష్యులకు సమాధానమంట 

రెక్కలు చాచి – చక్కనైన దూతలు 

మధురమైన పాట లెన్నో పాడుచుండ వినరండి