బెత్లెహేము ఊరిలో – పశులపాక నీడలో

 

బెత్లెహేము ఊరిలో – పశులపాక నీడలో 

ఉదయించె బాలుడు – రవికోటితేజుడు 

అ.ప. : ఆనందామానందామానందాం (4) 

 

1. సింహాసనం విడచి – పరమ సౌఖ్యం మరచి 

నరులహృది భానుడై – ధరకు దిగె దీనుడై 

 

2. మహిమరూపం మార్చి – మంటి దేహం దాల్చి 

పాపశ్రమ మోయను – శాపమును బాపను 

 

3. తండ్రి చిత్తం నెరవేర్చ – పరిశుద్ధరక్తం కార్చ 

లోక ఇక్కట్లను తీర్చ – మరణశక్తిని హతమార్చ