బంగారు తండ్రి నా యేసయ్య

 

బంగారు తండ్రి నా యేసయ్య 

స్తోత్రము చెల్లింతును యేసయ్య 

నేరము చేసితిని నేనయ్యా                 !2! 

నా భారాన్ని మోసినా యేసయ్యా….. 

 

1.పాపము నుండి నీ నన్ను విడిపించి 

రక్తము నాకై నీవు చిందించి           !2! 

రక్షణ వస్త్రమును నాకిచ్చి..               !2! 

నా రక్షకుడైనావు యేసయ్యా…. 

 

2.శత్రువు నుండి నన్ను విడిపించి 

నీ రెక్కల నీడలో దాచితివి               !2! 

దుఃఖములన్నియు బాపితివా          !2! 

నా చక్కని తండ్రివయ్య యేసయ్యా… 

 

3.అడుగులు జారక నన్ను నడిపితివి 

నీ ఉన్నత సేవకై పిలిచితివి              !2! 

ఎన్నిక లేని నన్ను ఎన్నుకుని            !2! 

ఇంత భాగ్యతనిచ్చావు యేసయ్యా….