అలల పైనే నడచినా నాదు యేసయ్యా-నాదు యేసయ్యా

ప: అలల పైనే నడచినా నాదు యేసయ్యా-నాదు యేసయ్యా

గలిబిలిని నా కలవరములను-తొలగచేసిన కలుషహరుడా (2)

ఆదుకోవయ్యా-నాదుయేసయ్యా-ఆదుకోవయ్యా-నాదుయేసయ్యా

1.శుద్ధుడా నీ పిలుపు వింటిని-అద్దరికి నే పయనమైతిని  (2)

ప్రొద్దుపోయెను భయము లాయెను-ఉద్దరించగా స్వామి రావా  “ఆదు”

2.నట్టనడి సంద్రాన రేగెను-అట్టహాసపు పెనుతుఫాను  (2)

గట్టుచూడగా చాలా దూరము-ఇట్టి శ్రమలలో చిక్కుకొంటిని  “ఆదు”

3.అలలు నాపై విసిరి కొట్టగా-నావ నిండుగా నీరు చేరెను  (2)

బ్రతుకు లెంతో భారమాయెను-రేవు చేరే దారి లేదా   “ఆదు “