ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిదినిజము

 

ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది 

నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది 

 

ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ 

ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ             ||ప్రేమ|| 

 

తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును 

కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును                        ||ఎన్నడెన్నడు|| 

 

భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము 

వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును   ||ఎన్నడెన్నడు|| 

 

బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము 

నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును        ||ఎన్నడెన్నడు|| 

 

ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును 

క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును        ||ఎన్నడెన్నడు||