ప్రేమ.. యేసయ్య ప్రేమా – 4మారనిది మరువనిదీ వీడనిదీ ఎడబాయనిదీ

 

ప్రేమ యేసయ్య ప్రేమా (4) 

మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2)          ||ప్రేమ|| 

 

తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ 

తండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ (2) 

నే ఏడుస్తుంటే – ఎత్తుకున్న ప్రేమా 

తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా (2)          ||ప్రేమ|| 

 

నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ 

నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2) 

నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా 

తన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా (2)          ||ప్రేమ|| 

 

నేను పుట్టకముందే నను ఎన్నుకున్న ప్రేమ 

నేను ఎరుగకముందే ఏర్పరుచుకున్న ప్రేమ (2) 

తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమా 

ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా (2)          ||ప్రేమ||