ప్రేమ అనే మాయలో చిక్కుకున్న సోదరీ (సోదరా)

 

ప్రేమ అనే మాయలో చిక్కుకున్న సోదరీ (సోదరా) 

కన్నవారీ కలలకు దూరమై కష్టాల కడలికి చేరువై (2)  

1.తల్లిదండ్రులు కలలు కని రెక్కలు ముక్కలు చేసుకొని (2)  

రక్తము చెమటగా మార్చుకుని నీపైన ఆశలు పెట్టుకొని నిన్ను చదివిస్తే   

పట్టణం పంపిస్తే..ప్రేమకు లోబడి బ్రతుకులొ నీవు చెడి(2)  

కన్నవారి కలలకు దూరమై కష్టాల కడలికి చేరువై  

2.ప్రభు ప్రేమను వదులుకొని ఈలోక ఆశలు పట్టుకొని(2) 

యేసయ్య క్షమను వలదని దేవుని పిలుపును కాదని      

నీవు జీవిస్తే…తనువును చాలిస్తే  

నరకము చేరుకొని అగ్నిలో కూరుకొని (2) 

కొన్నతండ్రీ కలలకు దూరమై కష్టాల కడలికి చేరువై(2)