ప్రేమించె వారు లేరని వేదించేవారందరని

ప్రేమించె వారు లేరని వేదించేవారందరని “2“ 

వేదన చెందుచున్నావా – ఆవేదన చెందుచున్నావా “2”  “ప్రేమించెవారు “ 

1.వ్యాధి బాధలందు నీవు – వేదనలోనుంటివా     

స్వస్థపరచు యెహోవానే – నీవెరుగకుంటివా     

శూన్యము నుండి సమస్తము చేసిన దేవుడు     

నీ వ్యాధి బాధలను తీర్చుటకు ఆయన సమర్ధుడు     

ఆ యేసునే నమ్ముకో ఆవేదన తీర్చుకో “2 “ 

2. లోకమంత ఏకమై నిన్ను ద్వేషించిన     

ప్రేమించే యేసునే నీవెరుగకుంటివా     

మరణము నుండి జీవముకు పిలిచిన దేవుడు     

ఈ లోకము నుండి వేరు చేయును ప్రేమించిన యేసుడు     

ఆ యేసునే నమ్ముకో ఆవేదన తీర్చుకో “2″