ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు

ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు 

పాలించు దేవుడు – యేసు దేవుడు 

పాటలు పాడి ఆనందించెదం 

ఆహా ఎంతో ఆనందమే (2)       ||ప్రేమించు|| 

 

తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు 

ప్రతి అవసరమును తీర్చు దేవుడు (2) 

హల్లెలూయా ఆనందమే 

సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు|| 

 

నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు 

తోడు నీడగా నన్ను కాపాడును (2) 

హల్లెలూయా ఆనందమే 

సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు|| 

 

నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు 

సర్వ కాలమందు జయమిచ్చును (2) 

హల్లెలూయా ఆనందమే 

సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు|| 

 

ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు 

అంతము వరకు చేయి విడువడు (2) 

హల్లెలూయా ఆనందమే 

సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||