ప్రేమసాగరా సిల్వయాగం చేసినావయ్యా నీ కృప చూపినావయ్యా

 

ప్రేమసాగరా సిల్వయాగం చేసినావయ్యా నీ కృప చూపినావయ్యా 

యేసుదేవరా నీదు త్యాగం మరువలేనయ్యా నీ ఋణం తీర్చలేనయ్యా 

1. నాదు బ్రతుకులో శాంతి లేక బ్రతుకె బరువుగా మారిపోయెను 

భారమైన సిలువ మోసి శ్రమలనోర్చితివి నాదు వ్యధలు తీర్చీతివి 

2. ఎంత వెదకినా కొంచెమైనా నాలో స్వస్థత లేకయుండెను 

గాయములు నా కొరకు పొంది రక్తము కార్చితివి నన్ను శుద్ధి చేసితివి 

3. నాదు పాపం ఘోరశాపం నన్ను మృతునిగ మార్చివేసెను 

హీనమైన మరణమొంది తిరిగిలేచితివి నాకు జీవమిచ్చితివి.