ప్రేమమయా యేసు ప్రభువా – నిన్నే స్తుతింతును ప్రభువా

 

ప్రేమమయా యేసు ప్రభువా – నిన్నే స్తుతింతును ప్రభువా  2 

అనుదినమూ – అనుక్షణము –2నిన్నే స్తుతింతును ప్రభువా –ప్రేమమయా యేసు ప్రభువా – నిన్నే స్తుతింతును ప్రభువా 

1. ఏ యోగ్యత లేని నన్ను – నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా 2 

నన్నెంతగానో ప్రేమించినావు –2     నీ ప్రాణమిచ్చావు నాకై – 

ప్రేమమయా యేసు ప్రభువా – నిన్నే స్తుతింతును ప్రభువా       

2. ఎదవాకిటను నీవు నిలచి – నా హృదయాన్ని తట్టావు ప్రభువా –హౄదయాంగణములోకి అరుదెంచినావు –2    నాకెంతో ఆనందమే2 

ప్రేమమయా యేసు ప్రభువా – నిన్నే స్తుతింతును ప్రభువా    

3.శోధనలు నను చుట్టుకొనినా – ఆవేదనలు నను అలుముకొనినా  

శోధనరోదన ఆవేదనలో –2    నిన్నే  స్తుతింతు (ను) ప్రభువా –2