ప్రేమగల మా ప్రభువా

 ప్రభువా 

ప్రేమయై యున్నావయా (2)          ||ప్రేమగల|| 

 

నీదు ప్రేమ నిత్యమైనది – కరుణతో నాకర్షించె (2) 

నిక్కముగ రుజువాయెను – ప్రాణమిచ్చుట ద్వారనే (2)          ||ప్రేమగల|| 

 

అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను (2) 

అద్భుత ప్రేమ యిదే పాపములను కప్పెను (2)          ||ప్రేమగల|| 

 

బలమగు యీ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను (2) 

వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపును (2)          ||ప్రేమగల|| 

 

తల్లియైన మరచుగాని నీవు యెన్నడు మరువవు (2) 

తండ్రి ప్రేమ మారదు – మార్పుచెందని ప్రేమయే (2)          ||ప్రేమగల|| 

 

మరణమంత బలముగలది నీదు ప్రేమ ప్రభువా (2) 

వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను (2)          ||ప్రేమగల||