ప్రీతిగల మన యేసు – డెంతో గొప్ప మిత్రుడుమితిలేని

 

ప్రీతిగల మన యేసు – డెంతో గొప్ప మిత్రుడు 

మితిలేని దయచేత – హత్తుచు ప్రేమించును 

క్రీస్తునొద్ద మన భార – మంత నప్పగించినన్ 

శక్తిగల యేసు చేత – మోత లెల్ల వీడును 

 

నీతిగల మన యేసు – ధృతిగల మిత్రుడు 

మృతి బొంది కృపతో వి – శ్రాంతి కలిగించెను 

భీతి నొందు బాపులైన – జింతా క్రాంతులైనను 

క్రీస్తు యొక్క దీప్తి చేత – క్రొత్త గతి జూతురు 

 

దయగల మన యేసు – ప్రియమైన మిత్రుడు 

మాయలోకమందు నిజా – శ్రయుడై కాపాడును 

భయ దుఃఖ శ్రమ లాది – మోయరాని బాధలన్ 

జయ మొప్ప నేర్పి యేసు – స్థాయి వృద్ది చేయును 

 

ధారుణిలో యేసుగాక – వేరు గొప్ప మిత్రుడా? 

పరలోకమందు యేసే – వీరుడౌ రక్షకుడు 

నారకులగావ వేగా – గ్రూర హింస బొందెను 

కరుణించి నిచ్చి ప్రతి – ప్రార్థన నాలించును