ప్రియ యేసు రాజును నే చూచిన చాలు

 

ప్రియ యేసు రాజును నే చూచిన చాలు 

మహిమలో నేనాయనతో ఉంటే చాలు ||2|| 

నిత్యమైన మోక్షగృహము నందు చేరి 

భక్తుల గుంపులో హర్షించిన చాలు ||2||             ||ప్రియ యేసు|| 

 

యేసుని రక్తమందు కడుగబడి 

వాక్యంచే నిత్యం భద్రపరచబడి ||2|| 

నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను ||2|| 

బంగారు వీదులలో తిరిగెదను ||2||                   ||ప్రియ యేసు|| 

 

ముండ్ల మకుటంబైన తలను జూచి 

స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్ ||2|| 

కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి ||2|| 

ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్ ||2||       ||ప్రియ యేసు|| 

 

హృదయము స్తుతులతో నింపబడెను 

నా భాగ్య గృహమును స్మరించుచు ||2|| 

హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ ||2|| 

వర్ణింప నా నాలుక చాలదయ్యా ||2||                  ||ప్రియ యేసు|| 

 

ఆహ ఆ బూర ఎప్పుడు ధ్వనించునో 

ఆహ నా ఆశ ఎప్పుడు తీరుతుందో ||2|| 

తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో ||2|| 

ఆశతో వేచియుండే నా హృదయం ||2||               ||ప్రియ యేసు||