ప్రియ యేసు నిర్మించితివి – ప్రియమార నా హృదయం

 

ప్రియ యేసు నిర్మించితివి 

ప్రియమార నా హృదయం 

మృదమార వసియించునా 

హృదయాంతరంగమున 

 

నీ రక్త ప్రభావమున 

నా రోత హృదయంబును ||2|| 

పవిత్రపరచుము తండ్రి 

ప్రతి పాపమును కడిగి ||2||         ||ప్రియ యేసు|| 

 

అజాగరూకుడనైతి 

నిజాశ్రయమును విడచి 

కరుణారసముతో నాకై 

కనిపెట్టితివి తండ్రి ||2||               ||ప్రియ యేసు|| 

 

వికసించె విశ్వాసంబు 

వాక్యంబును చదువగనే ||2|| 

చేరితి నీదు దారి 

కోరి నడిపించుము ||2||             ||ప్రియ యేసు|| 

 

ప్రతి చోట నీ సాక్షిగా 

ప్రభువా నేనుండునట్లు ||2|| 

ఆత్మాభిషేకమునిమ్ము 

ఆత్మీయ రూపుండా ||2||           ||ప్రియ యేసు||