ప్రియ యేసు నాథ పని చేయ నేర్పునీదు పొలములో

 

ప్రియ యేసు నాథ పని చేయ నేర్పు 

నీదు పొలములో కూలివానిగా 

కావాలి నేను నీదు తోటకు కావలివానిగా 

అంకితం ఈ జీవితం నా యేసు నీ కోసమే 

అంకితం ఈ జీవితం విద్యార్ధి లోకానికే 

 

స్వచ్చమైన ప్రేమను మచ్చలేని సేవను 

మెచ్చునేసు మహిమతో వచ్చు వేల (2) 

మరువకు నా ప్రాణమా 

నీ ప్రయాస వ్యర్ధము కాదు (2)     ||ప్రియ యేసు|| 

 

ఏక భావము సేవ భారము 

యేసు మనసుతో సాగిపోదును (2) 

విసుగక విడువక 

కష్టించి పని చేసెదన్ (2)          ||ప్రియ యేసు||