ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా 

నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2) 

యేసయ్యా కావాలయ్యా 

నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2)      || ప్రార్థన || 

 

ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి 

నేను ప్రార్థింపగ దయచేయుమా (2) 

ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2) 

నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2)       || ప్రార్థన || 

 

సింహాల గుహలోని దానియేలు శక్తి 

ఈ లోకంలో నాకు కావలయ్యా (2) 

నీతో నడిచే వరమీయుమా (2) 

నీ సిలువను మోసే కృపనీయుమా (2)       || ప్రార్థన || 

 

పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి 

నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2) 

చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2) 

ఈ చిన్న వాడిని అభిషేకించు (2)          || ప్రార్థన ||