ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార

 

ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార 

ప్రణుతింతును నిన్నే- ఆశతీర ప్రాణేశ్వర –  

ప్రభు దైవకుమార  

1.నా ఆత్మతో పాటలు పాడ – నీ కృపలే నాకు హేతువులాయె –2     

నిత్య నిబంధన నీతో చేసి – నీ పాద సన్నిధి చేరియున్నానే2    ప్రాణేశ్వర॥.                                         

2.నా ఊటలన్నియు నీ యందేనని – వాద్యము వాయించి పాడెదను –2     

జీవిత కాలమంతా నిన్నే స్తుతించి – సాగెద నూతన యెరూషలేము –2॥ ప్రాణేశ్వర ॥ 

3. కమనీయమైన నీ దర్శనము – కలనైనను మెలకువనైన –2     

కనబడినా నా ఆశలు తీరవే – కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి –॥ ప్రాణేశ్వర ॥