ప్రాణమా నా ప్రాణమా

 

పరిశుద్ధుడు పరిశుద్ధుడు – రాజుల రాజు యేసు 

బలవంతుడు బలమిచ్చును – ప్రభువుల ప్రభువు క్రీస్తు (2) 

 

గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిననూ 

అగాధ జల ప్రవాహములో నేను సాగవలసిననూ (2) 

ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా 

ఎన్నటికీ వెనుతిరుగను నాయందు నీవుండగా       ||పరిశుద్ధుడు|| 

 

నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాసపడుదును 

కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును (2) 

ఎన్నటికీ వెనుతిరుగను అండ నీవుండగా 

ఎన్నటికీ ఓడిపోను – జయశాలి నీవుండగా         ||పరిశుద్ధుడు||