ప్రయాసతో పరుగులెత్తినా – పొందాలని ఆశించినా

 

ప్రయాసతో పరుగులెత్తినా – పొందాలని ఆశించినా 

కరుణించు దేవా నీ కృపచేతనే 

కార్యాలు నెరవేరును – కోరికలన్నీ తీరును 

1. కన్నిటితో నీకు మొరపెట్టినా 

ఉపవాసపు దీక్షపట్టి కనిపెట్టినా 

ప్రార్థన వినుదేవా నీ కృపచేతనే 

మనవులు సన్నిధిని చేరును – త్వరగా జవాబు దొరుకును 

2. కుడి ప్రక్కను పదివేలమంది కూలినా 

హతమార్చను శత్రువులు చుట్టు చేరినా 

రక్షించు దేవా నీకృపచేతనే 

అపాయములు తొలగిపోవును-క్షేమము నెమ్మదియు కలుగును 

3. తెలివితేటలెన్నో ఉపయోగించినా 

బలశౌర్యములన్నీ ప్రయోగించినా 

దీవించు దేవా నీ కృపచేతనే 

చేతిపనుల ఫలితముండును – ధాన్యముతో కొట్లు నిండును