ప్రభో ప్రభో అని పదే పదే ప్రార్దించుట పలితం శూన్యం

 

ప్రభో ప్రభో అని పదే పదే ప్రార్దించుట పలితం శూన్యం (2) 

ప్రతీదినం నీ సిలువనెత్తికొని పయనించుటఏ పవిత్రవేదం 

ఇదేసత్యం ఇదేనిత్యం ఇదేమార్గం ఇదేజీవం (2) ప్రబో 

 1.చెదరినచూపుల చీకటిదారుల పరుగులెత్తకూ   

చేసిన తప్పులు తీర్పులోకి మరి రాకతప్పవూ (2) 

నిన్నానేడు వ్యర్దమని అంతావృదా ప్రయాసయని (2) 

నువుచెప్పక ముందే చేజారక ముందే 

శృష్టికర్తను స్మరనచేసుకొ శరణు ప్రభోఅని సిలువ నెత్తుకొ 

ఇదేసత్యం ఇదేనిత్యం ఇదేమార్గం ఇదేజీవం (2) ప్రబో 

 2.నేడుకాదని రేపోమాపని వాయిదావేయకూ   

పుట్టుకా చావు నీకు తెలియదని గుర్తుచేసుకో (2) 

ముందూ వెనకా తేడాలోఅందరుపోయే వారని (2) 

నువు పోకముందే ఆప్రభు రాకముందే 

మనసు మార్చుకొని నడకదిద్దుకొ శరణు ప్రభోఅని  

సిలువ నెత్తుకొ ఇదేసత్యం ఇదేనిత్యం ఇదేమార్గం ఇదేజీవం (2) ప్రబో