ప్రభు యేసు నిను పిలువగా – నీవు పరుగిడెదవా నిలువక

 

ప్రభు యేసు నిను పిలువగా – నీవు పరుగిడెదవా నిలువక (2) 

1. బంగారు మేడలున్నా – బహు ధనధాన్యాదులున్నను (2) 

    మారుమనస్సు లేనిచో – నీవు నరకాగ్నిలో నుందువూ.. 

2. పాప భీతి లేకుండా పగలు రేయి ధ్యానించినా        (2) 

    మారుమనస్సు లేనిచో – నీవు నరకాగ్నిలో నుందువూ.. 

3. నీధనము హెచ్చినను – నీ తనువు కాల్చుకున్నను (2) 

    మారుమనస్సు లేనిచో – నీవు నరకాగ్నిలో నుందువూ..     

4. ప్రవచించి ప్రార్ధించినా – పలు భాషలతో ప్రకటించినా… (2) 

    మారుమనస్సు లేనిచో – నీవు నరకాగ్నిలో నుందువూ