ప్రభు యేసు నా రక్షకా నొసగు కన్నులు

 

ప్రభు యేసు నా రక్షకా 

నొసగు కన్నులు నాకు 

నిరతము నే నిన్ను జూడ (2) 

అల్ఫయు నీవే – ఒమేగయు నీవే (2)          ||ప్రభు యేసు|| 

 

ప్రియుడైన యోహాను పత్మాసులో 

ప్రియమైన యేసు నీ స్వరూపము (2) 

ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె 

ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2)          ||ప్రభు యేసు|| 

 

లెక్కలేని మార్లు పడిపోతిని 

దిక్కులేనివాడ నేనైతిని (2) 

చక్కజేసి నా నేత్రాలు దెరచి 

గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2)             ||ప్రభు యేసు|| 

 

ఎరిగి యెరిగి నే చెడిపోతిని 

యేసు నీ గాయము రేపితిని (2) 

మోసపోతి నేను దృష్టి దొలగితి 

దాసుడ నన్ను జూడనిమ్ము (2)             ||ప్రభు యేసు|| 

 

ఎందరేసుని వైపు చూచెదరో 

పొందెదరు వెల్గు ముఖమున (2) 

సందియంబు లేక సంతోషించుచు 

ముందుకు పరుగెత్తెదరు (2)             ||ప్రభు యేసు|| 

 

విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ 

కొనసాగించువాడా యేసు ప్రభూ (2) 

వినయముతో నేను నీ వైపు జూచుచు 

విసుగక పరుగెత్త నేర్పు (2)             ||ప్రభు యేసు|| 

 

కంటికి కనబడని వెన్నియో 

చెవికి వినబడని వెన్నియో (2) 

హృదయ గోచరము కాని వెన్నియో 

సిద్ధపరచితివ నాకై (2)                 ||ప్రభు యేసు|| 

 

లోక భోగాలపై నా నేత్రాలు 

సోకకుండునట్లు కృప జూపుము (2) 

నీ మహిమ దివ్య స్వరూపమును 

నిండార నను జూడనిమ్ము (2)          ||ప్రభు యేసు||