ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె

 

ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె (2) 

పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో (2) 

పరలోకముకై – చిర జీవముకై (2) 

ప్రార్ధించెను నా హృదయం             ||ప్రభు యేసుని|| 

 

దిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో (2) 

దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును (2) 

ధన పీడనతో – మృగ వాంఛలతో (2) 

దిగాజారితి చావునకు              ||ప్రభు యేసుని|| 

 

యేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు (2) 

ఈ పాపిని క్షమియించి – జ్ఞాపకముతో బ్రోవుమని (2) 

ఇల వేడితిని – విలపించుచును (2) 

ఈడేరెను నా వినతి             ||ప్రభు యేసుని|| 

 

పరదైసున ఈ దినమే – నా ఆనందములోను (2) 

పాల్గొందువు నీవనుచు – వాగ్ధానము చేయగనే (2) 

పరలోకమే నా – తుది ఊపిరిగా (2) 

పయనించితి ప్రభు కడకు          ||ప్రభు యేసుని||