ప్రభువా మాకు నీవిచ్చిన బహుమానము – బహు శ్రేష్టమైనది

ప్రభువా మాకు నీవిచ్చిన బహుమానము – బహు శ్రేష్టమైనది 

మా జీవితాలలో ఈ నూతన పరిణామము – ప్రత్యేకమైనది (2) 

గర్భములో రూపింపబడిన నాటినుండి 

కాపాడితివయ్యా – ఇకను కాపాడుమయ్యా (2) 

నీ సన్నిధిలో నిలిపే దయ చూపవా 

నీ జ్ఞానములో పెంచే కృపనీయవా (2)          ||ప్రభువా|| 

 

1.నీ మార్గములో తన కాళ్ళతో నడవాలి నా యేసయ్యా 

నీ సత్యమును తన కళ్ళతో చూడాలి నా యేసయ్యా (2) 

తన చేతులతో నీ సేవను చేస్తూ 

తన పెదవులతో నిను స్తుతియించాలయ్యా (2) 

ప్రార్థనాపరురాలిగ ఉండాలయ్యా         ||నీ సన్నిధిలో|| 

 

2.నీ వాక్యము తన హృదయములో పదిలముగా ఉండాలయ్యా 

నీ తలంపులు అన్ని వేళలా తన మదిలో నిండాలయ్యా (2) 

నీ దయయందు మనుష్యుల దయయందు 

వర్ధిల్లేలా నీవే దీవించయ్యా (2) 

నీ ప్రియమైన బిడ్డగా స్థిరపరచయ్యా        ||నీ సన్నిధిలో||