ప్రభువా – నీ సముఖము నందు సంతోషము – కలదు

 

ప్రభువా – నీ సముఖము నందు  సంతోషము – కలదు 

హల్లెలూయా సదా – పాడెదన్     

హల్లెలూయా సదా – పాడెదన్  

ప్రభువా – నీ సముఖము నందు 

 1. పాపపు ఊబిలో – నేనుండగా  

    ప్రేమతో – నన్నాకర్షించితిరే –2 

    కల్వారి రక్తంతో – శుద్ధి చేసి –2 

    రక్షించి పరిశుద్ధులతో – నిల్పి                     ॥ ప్రభువా ॥  

2. సముద్ర – తరంగముల వలె  

    శోధనలెన్నో– ఎదురైనను –2 

    ఆదరణ కర్తచే – ఆదరించి –2 

    నీ నిత్య కృపలో – భద్రపరచి                        ॥ ప్రభువా ॥  

3. సౌందర్య సీయోన్ని – తలంచగా  

    ఉప్పొంగుచున్న – హృదయముతో –2 

    ఆనందమానంద – మానందమాని –2 

    ప్రియునితో నేను పాడెదను