ప్రభువా నీ కలువరి త్యాగము – చూపెనే నీ పరిపూర్ణతను

 

ప్రభువా నీ కలువరి త్యాగము – చూపెనే నీ పరిపూర్ణతను 

    నాలో సత్‌ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే  “ప్రభువా” 

 

1. నీ రక్షణయే ప్రాకారములని – ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి – 2   

  లోకములోనుండి ననువేరు చేసినది  – నీదయా సంకల్పమే   – 2     “ప్రభువా” 

 

2. జీవపు వెలుగుగ నను మార్చుటకే – పరిశుద్ధాత్మను నాకొసగితివే – 2     

శాశ్వత రాజ్యముకై నను నియమించినది – నీ అనాది సంకల్పమే – 2 “ప్రభువా” 

 

3. సంపూర్ణునిగా నను మార్చుటకే – శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే – 2    

 పరిపూర్ణ శాంతితో నను కాచుటయే – నీ నిత్యసంకల్పమే– 2            “ప్రభువా”