ప్రభువా నా ప్రార్థన అలకించుమా

 

ప్రభువా నా ప్రార్థన అలకించుమా 

దేవా నా మొర నీ సన్నిధికి చేరనీయుమా 

1కారు చీకటిలో  నా దారి కానకపోయేనే 

నమ్మిన ఆ స్నేహమే నన్ను ఒంటరినిగా చేసేనే 

కాదనని ప్రేమకై నే నిను చేరితినయా(2) 

2మరపురాని నిందలే నా గాయములను రేపేనే 

మదిలో నిండిన భయములే నను కృంగదీసెనే 

నన్ను మరువలేని ప్రేమకై(నే) నిను చేరితినయ్యా(2) 

నేను చేసిన పాపమే నాకు శాపమై మిగిలెనే 

నా దోష కార్యములే నన్ను నీకు దూరం చేసేనే 

నను మన్నించే ప్రేమకై (నే) నిను చేరితినయ్యా(2)